నీ సంగతి చూస్తా..మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర
TeluguStop.com
మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నిండు సభలో నీ సంగతి చూస్తా అంటూ ఓ మీడియా ప్రతినిధిపై నిప్పులు చెరిగారు.
విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయారు.
రైతు భరోసా నిధులు విడుదల సభలో పాల్గొన్న ఆయన.జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా.
ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు.అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ.
చేయి చూపించి కులం పేరుతో దూషించారు.మాజీ మంత్రి తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?