వైసీపీ హయాంలో పోలవరం పనులపై మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!!

శుక్రవారం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) సాగునీటి ప్రాజెక్టులు మరియు పోలవరం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో పోలవరం పనులపై శ్వేత పత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుపై సంచలన ఆరోపణలు చేశారు.

పరిస్థితి ఇలా ఉండగా సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ నాయకుడు మాజీమంత్రి అంబటి రాంబాబు( Former Minister Ambati Rambabu ) స్పందించారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. """/" / తానే ఏడు గ్రామాలను ఏపీలో విలీనం చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు.

కానీ ప్రాజెక్టుకు 2005 నుంచి క్లిష్టమైన అనుమతులన్నీ వైయస్సారే తెచ్చారు.పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ, పునరావస ప్రణాళిక, పాపికొండల వన్యప్రాణ సంరక్షణ కేంద్రం మళ్లింపు లాంటి అనుమతులు తీసుకొచ్చారు.

అని గుర్తు చేశారు.తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

కరోనా లాంటి కీలక సమయాలలో కూడా వేగంగా పనులు చేశామన్నారు.1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు.

గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్న ఎందుకు పట్టించుకోలేదని అంబటి రాంబాబు నిలదీశారు.

ప్రభాస్, బన్నీలలో నంబర్ వన్ ఎవరు.. ఈ ప్రశ్నకు జవాబు దొరికేది అప్పుడేనా?