డెట్రాయిట్‌లో నువ్వా నేనా : భారత సంతతి నేత శ్రీ థానేదర్‌తో తలపడనున్న ఎక్స్ సర్వీస్‌మెన్
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.ఇక రాజకీయాల సంగతి సరేసరి.
అక్కడ కీలక పదవుల్లో మనవారే వున్నారు.స్వయంగా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.
( Kamala Harris ) భారత మూలాలకు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణం.
వీరు అమెరికన్ రాజకీయాల్లో పాతుకుపోయి వ్యవస్థలను శాసిస్తున్నారు.వారిపై ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ప్రత్యర్ధులు ఒకటికి రెండుసార్లు ఆలోచించే స్థాయికి చేరుకున్నారు.
"""/" /
కాగా.మిచిగాన్ రాష్ట్ర మాజీ సెనేటర్, మిలటరీ వెటరన్ ఆడమ్ హోలియర్( Adam Hollier ) రిపబ్లికన్ పార్టీ తరపున రాష్ట్రంలోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ బరిలో నిలిచినట్లు చెప్పారు.
డెట్రాయిట్ ( Detroit ) నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతి నేత శ్రీ థానేదర్‌తో( Shri Thanedar ) ఆయన తలపడనున్నారు.
13 కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్.డెట్రాయిట్, వేక్ కౌంటీ ఈస్ట్, సౌత్ భాగాల్లో విస్తరించింది వుంది.
ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడుతూ.తమకు బట్వాడా చేసే కాంగ్రెస్‌వాది కావాలని, కానీ దురదృష్టవశాత్తూ థానేదర్ లాంటి మల్టీమిలియనీర్లు మీమ్స్ పోస్ట్ చేయడంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దుయ్యబట్టారు.
తన జీవితమంతా పోరాటాలతో గడిపానని , అవసరమైన వారికి సేవ చేశానని.ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ అదే చేస్తానని ఆడమ్ స్పష్టం చేశారు.
"""/" /
ఇకపోతే.2021 జనవరి నుంచి శ్రీ థానేదర్ విజయం సాధించి యూఎస్ ప్రతినిధుల సభలో అడుగుపెట్టారు.
కెమిస్ట్రీలో డాక్టోరల్ అధ్యయనాల కోసం కర్ణాటక నుంచి 1979లో అమెరికా( America ) వెళ్లిన మొదటి తరం వలసదారుల్లో శ్రీ కూడా ఒకరు.
మిచిగాన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేసిన ఆయన.1987లో ఫాంట్‌బోన్ కాలేజీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
అక్కడ టీచర్‌కు సహాయకుడిగా పనిచేస్తూ నెలకు 300 డాలర్ల వేతనాన్ని అందుకుని, అందులో నుంచి 75 డాలర్లను ఇంటికి పంపేవాడు.
తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన తానేదార్.ఫార్మా రంగంలో పలు కంపెనీలను స్ధాపించారు.
సామాజిక, జాతి, ఆర్ధిక సమానత్వం కోసం పోరాడాలనుకున్న ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ల సిద్ధాంతాలను తానేదార్ ఆచరిస్తారు.
యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?