మాజీ హోమ్ గార్డ్ రామకృష్ణ హత్య కేసులో ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవాలు..!!

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాజీ హోంగార్డు రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ గౌడ్ ది పరువు హహత్యేనని పోలీసులు తేల్చడం తెలిసిందే.

ఏప్రిల్ 15వ తారీకు రామకృష్ణ ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య భార్గవి పోలీసులను ఆశ్రయించి లతీఫ్ అనే వ్యక్తి పై అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది.

ఈ క్రమంలో పోలీసులు లతీఫ్ నీ అదుపులోకి తీసుకుని విచారించగా భార్గవి తండ్రి వెంకటేశ్వర్లు.

రామకృష్ణ ని హతమార్చినట్లు.వెల్లడించటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ హత్యకు సంబంధించి తన భార్యతో పాటు మరో ముగ్గురు సహకరించడం జరిగిందని పోలీసు విచారణలో లతీఫ్ చెప్పటం సంచలనంగా మారింది.

హత్యకు గల కారణం.భార్గవి తండ్రికి ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడమేనని.

అందువల్లే పరువు దృష్టిలో పెట్టుకొని.తండ్రి వెంకటేశ్వర్లు రామకృష్ణనీ అత్యంత కిరాతకంగా జరిగిందని భువనగిరి ఏసీబీ వెంకట్ రెడ్డి ఇటీవల వెల్లడించారు.

ఈ క్రమంలో ఈ హత్య చేసే బాధ్యతను లతీఫ్ అనే వ్యక్తికి నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రామకృష్ణ మృతదేహం సిద్దిపేట జిల్లా లక్డారం వద్ద కనుగొనగా.దానికి పోస్టుమార్టం నిర్వహించిన క్రమంలో.

హత్య చేసిన విధానం గురించి వస్తున్న విషయాలు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి.మేటర్ లోకి వెళ్తే.

రామకృష్ణ ని లతీఫ్ తో పాటు అతని భార్య మొత్తం 11 మంది చుట్టుముట్టి రామాపురం నిమ్మ తోటలో.

విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగిందట.నైలాన్ తాడు లతో రామకృష్ణ చేతులు కట్టేసి.

కళ్ళు తీసే కత్తితో పొడి చేసి వెంట తీసుకొచ్చిన సుత్తితో మేకులను.రామకృష్ణ బ్రతికుండగానే తల నుదిటిపై అత్యంత హింసాత్మకంగా హింసించి హత మరిచినట్టు పోలీసు విచారణలో బయట పడింది.

ఈ హత్యకు సంబంధించి 11 మందిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

వాళ్లను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలింపులు స్టార్ట్ చేయడం జరిగింది. """/"/ ప్రధానంగా కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకపోవటం తోనే రామకృష్ణని.

భార్గవి తండ్రి వెంకటేశ్వర్లు పథకం ప్రకారం.లతీఫ్ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు పోలీసులు విచారణలో తేలింది.

ఈ హత్యకు గాను లతీఫ్ గ్యాంగ్ కి వెంకటేశ్వర్లు 10 లక్షల సుఫారీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో వెంకటేశ్వర్లుతో పాటు యాదగిరి, అమృతయ్యా, రామరావు.పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రానికి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలనునట్లు సమాచారం.

 ప్రస్తుతం అయితే రామకృష్ణ మృతదేహానికి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది.అక్కడ పోస్ట్ మార్టం నిర్వహణ అనంతరం .

యాదాద్రి జిల్లా లోని రామకృష్ణ స్వస్థలం వలిగొండలో అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు రెడీ అయ్యారు.

వీడియో: ట్రంప్‌పై కోపంతో బంగారం లాంటి టీవీని నాశనం చేసిన యువతులు..