హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విడుదల

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Former HMDA Director Siva Balakrishna ) జైలు నుంచి విడుదలయ్యారు.

హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టు( Nampally ACB Court ) ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

దీంతో ఆయన చంచల్ గూడ జైలు( Chanchalguda Jail ) నుంచి విడుదల అయ్యారు.

శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు శివ నవీన్ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు.

అయితే ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు జనవరి 25వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

60 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో న్యాయస్థానం శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది.

రూ.లక్ష ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది.

ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..