Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మూడో రోజు కస్టడీ విచారణ

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiv Balakrishna ) మూడో రోజు ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఆధారాలను ముందుంచి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారిస్తున్నారు. """/" / శివబాలకృష్ణ అక్రమాస్తుల వెనుక ఐఏఎస్ అధికారి( IAS Officer ) పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఎనిమిదేళ్లుగా హెచ్ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన ఫైల్స్ పై అధికారులు దృష్టి సారించారని సమాచారం.

ఫైల్స్ పై సంతకాలకు ఐఏఎస్ అధికారికి మేజర్ వాటా ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో శివబాలకృష్ణ విచారణ తరువాత ఐఏఎస్ అధికారిపై ఏసీబీ విచారణ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇందుకోసం ఏసీబీ మరియు ఎంఏయూడీ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.అలాగే శివబాలకృష్ణ భార్య, బంధువు భరత్( Bharat ) పేరుపై మూడు లాకర్లను గుర్తించారు.

బినామీలకు రెండు నెలల క్రితం హోండా సిటీ కార్లను శివబాలకృష్ణ గిఫ్ట్ గా ఇచ్చినట్లు నిర్ధారించారు.

ఈ క్రమంలో గిఫ్ట్ రూపంలో కార్లను ఎందుకు ఇచ్చారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా..? ఆయనను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం….