ఏసీబీ ముందుకు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ..!!
TeluguStop.com
హెచ్ఎండీఏ( HMDA ) మాజీ డైరెక్టర్, రెరా ఇంఛార్జ్ కార్యదర్శి శివ బాలకృష్ణ( Shiva Balakrishna ) కస్టడీ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో( ACB Court ) విచారణ జరగనుంది.
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో భాగంగా అధికారులు ఆయనను కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు.
ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో శివబాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట మొత్తం 15 బ్యాంకు లాకర్లు( 15 Bank Lockers ) ఉన్నట్లు గుర్తించారు.
సోదాల సమయంలో శివబాలకృష్ణ నివాసంలో ఉన్న రూ.84 లక్షల నగదు దొరికిన సంగతి తెలిసిందే.
"""/" /
ఈ క్రమంలోనే లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయనను వారం రోజుల పాటు కస్టడీకి( Custody ) ఇవ్వాలని కోరుతూ అధికారులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.
కాగా శివబాలకృష్ణ తన ఆదాయానికి మించి పది నుంచి పన్నెండు రెట్లు ఆదాయాలను సంపాదించారని ఏసీబీ గుర్తించింది.
అలాగే శివబాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని సమాచారం.
అట్లీ లుక్ పై కామెంట్లు చేసిన బాలీవుడ్ కమెడియన్.. ఈ బాలీవుడ్ నటుల తీరు మారదా?