వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ చేరే జట్లు ఇవే.. మాజీ క్రికెటర్ల జోస్యం..!

భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న ప్రారంభం అవ్వనున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అయి, నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే కొంతమంది మాజీ క్రికెటర్లు సెమీస్ కు చేరే జట్లు( Semi Final Teams ) ఏవో జోస్యం చెబుతున్నారు.

అభిమానులు కూడా ఈ జట్లే సెమీస్ కు చేరుతాయని ప్రిడిక్షన్లు మొదలుపెట్టారు.మరి మాజీ క్రికెటర్ల జోస్యం ప్రకారం సెమీస్ కు చేరే జట్లు ఏవో చూద్దాం.

"""/" / శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర( Kumara Sangakkara ) అంచనా ప్రకారం వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్ లేదా ఇంగ్లాండ్ నిలిచే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశాడు.

తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్( Harbhajan Singh ) వన్డే ప్రపంచ కప్ సెమీస్ కు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు చేరతాయని తన ప్రిడిక్షన్ చెప్పాడు.

కొంతమంది మాజీ క్రికెట్ నిపుణులు ఈ వన్డే వరల్డ్ కప్ లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా ఉంటాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జట్లు సెమిస్ చేరడం కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఎప్పుడు గెలుస్తాయో.ఎప్పుడూ ఓడతాయో అంచనా కూడా వేయలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

పసికూన జట్లైన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు సెమీస్ కు చేరవు కానీ కొన్ని పెద్ద జట్ల అవకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని క్రికెట్ నిపుణుల అభిప్రాయం.

భారత్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొనే 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకొనున్నాయి.

ప్రయాణికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. ముంబై లోకల్‌ ట్రైన్‌లో ట్రాన్స్‌వుమన్ మిమిక్రీ అదుర్స్..