ఛీటింగ్ కేసులో మాజీ క్రికెటర్ అరెస్ట్.. ?

ఉన్నతంగా మలచుకోవలసిన జీవితాన్ని కొందరు చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారుల్లో సంపాధించడానికి ఆసక్తి చూపుతూ చివరికి బజారుపాలవుతున్నారు.

నలుగురి చేత ఛీ అనిపించుకుంటున్నారు.ప్రస్తుతం ఇలాంటి పని చేసిన ఓ మాజీ క్రికెటర్ జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.

ఆ వివరాలు తెలుసుకుంటే.శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన నాగరాజు గతంలో ఆంధ్రా రంజీ క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగరాజు పేరిట ఓ గిన్సిస్ బుక్ రికార్డు కూడా ఉంది.

2016లో ఏకధాటిగా 82 గంటల నెట్స్ లో బ్యాటింగ్ చేసిన అరుదైన రికార్డును నాగరాజు సొంతం చేసుకున్నాడు.

ఇలాంటి వ్యక్తి విలాసాలకు అలవాటుపడి దారితప్పాడు.తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరలేపాడు.

ఈ క్రమంలో రెయిన్ బో ఆసుసత్రి ఎండీ డాక్టర్ కంచర్ల రమేశ్ ను కలిసిన నిందితుడు తాను కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిగా పరిచయం చేసుకుని, త్వరలో కేటీఆర్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఈ కార్యక్రమం పై మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.

50 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడట.అనుమానం వచ్చిన రెయిన్ బో ఆసుపత్రి ఎండీ బంజారాహిల్స్ పోలీసులకు ఈ విషయం తెలియచేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

వైరల్ వీడియో: రోమాలు నిక్కపరిచేలా టీమిండియా టి20 ప్రపంచ కప్ ప్రోమో..