నేడు ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( Telangana Former Chief Minister KCR ) ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ మేరకు మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.

స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్( Speaker Gaddam Prasad Kumar ) సమక్షంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

"""/"/ఆ తరువాత అసెంబ్లీలోని ఎల్ ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా( Gajwel MLA ) విజయం సాధించారు.

సైబీరియన్ పులి ప్రేమ ప్రయాణం.. 200 కి.మీ దాటి, ప్రేయసి చెంతకు!