విశాఖ స్టీల్‎ప్లాంట్ బిడ్‎లో పాల్గొననున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!

విశాఖ స్టీల్‎ప్లాంట్ బిడ్‎లో పాల్గొంటానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.ఎక్స్‎ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలపై ఛార్టర్డ్ అకౌంటెంట్స్ తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు ఎక్స్‎ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‎లో పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

స్టీల్‎ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి తానే కోరారని చెప్పారు.

ఈ మేరకు స్టీల్ ప్లాంట్‎లో పెట్టుబడుల కోసం తెలంగాణ నిర్ణయం వెనుక తన ప్రమేయం కూడా దోహదం చేసి ఉండవచ్చని అన్నారు.

ఇందుకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆహ్వానించవచ్చని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

క్రిస్మస్ రోజున స్వీపర్‌కి అనూహ్య బహుమతి.. వీడియో చూస్తే మీరూ కన్నీళ్లు పెట్టుకుంటారు!