వైరల్ వీడియో: విమాన ప్రమాదంలో వ్యోమగామి కన్నుమూత..
TeluguStop.com
తాజాగా ఓ వ్యోమగామి విమాన ప్రమాదంలో( Plane Crash ) మరణించాడు.ఆ సమాచారాన్ని ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
అపోలో 8( Apollo 8 ) వ్యోమగామి విలియం ఆండర్స్( William Anders ) శాన్ జువాన్ దీవులలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.
ఈ విషయాన్నీ అతని కుమారుడు గ్రెగ్ ఈ సమాచారాన్ని పంచుకుంటూ ఆగతనకు సంబంధించిన వీడియోను షేర్ చేసారు.
అండర్స్ తన పాతకాలపు ఎయిర్ ఫోర్స్ T-34 మెంటార్ లో ఎగురుతున్నాడు.ఇకపోతే ఆయన వాషింగ్టన్ నగరం నుండి శాన్ జువాన్ దీవులకు వెళ్తుండగా ప్రయాణం చేస్తున్న విమానం నీటిలో కూలిపోయింది.
ఇక ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
దాంతో అది కాస్త వైరల్ గా మారింది. """/" /
ఇక ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం.
శుక్రవారం ఉదయం 11:45 గంటల సమయంలో జరిగిందని యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ పసిఫిక్ నార్త్‌వెస్ట్ అధికారులు వెల్లడించారు.
1968లో ఎర్త్ రైజ్ యొక్క అద్భుతమైన ఫోటో తీశారు విలియం ఆండర్స్ .
ఇక ఈయన మృతి పట్ల సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్దెత్తున సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన తీసిన ఫోటోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు నివాళులర్పించారు.
"""/" /
ఇక ఆయన గురించి కొందరు.అపోలో-8 వ్యోమగామి విలియం ఆండర్స్ శాంతితో విశ్రాంతి తీసుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
అలాగే మరికొందరు అతను తీసిన ఫోటోను షేర్ చేస్తూ.డిసెంబర్ 24, 1968న తీశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరేమో.మీరు, మీ సిబ్బంది మాకు మొదటిసారి ప్రపంచాన్ని చూపించారు.
మేము ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాము అంటూ కామెంట్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్ కెరీర్లో లైలా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్.. పరిస్థితి మరీ ఇంత ఘోరమా?