సెప్టెంబర్ 17లోపు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు..: సీఎం రేవంత్
TeluguStop.com
హైదరాబాద్( Hyderabad ) లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక భేటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.ఎన్నికల తరువాత గల్ఫ్ పాలసీ తీసుకొస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల ప్రమాద బీమా రూ.
5 లక్షలు ఇస్తామని చెప్పారు.గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్నారు.
ఈ మేరకు ప్రజాభవన్ లోనే వెల్ఫేర్ బోర్డు పెట్టి అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17వ తేదీ లోపు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు( Gulf Welfare Board )ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఏజెంట్లకు చట్టబద్ధత ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుకార్డు ఉన్నవారే ఏజెంట్లని తెలిపారు.రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ పై ఆధారపడ్డాయని చెప్పారు.
గల్ఫ్ వెళ్లే ముందు కార్మికులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.
చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు… సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!