సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయండి:ఎండి మజాహర్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):కోదాడ పోస్ట్ ఆఫీస్ లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని కోదాడ నియోజకవర్గ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు,స్ఫూర్తి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎండి.

మజాహర్( MD Mazahar ) పోస్టల్ అధికారులను కోరారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో హెడ్ పోస్ట్ మాస్టర్ రవికి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం బోర్డు లేనందున వినియోగదారులకు పోస్ట్ ఆఫీస్ ( Post Office )ద్వారా అందించే సేవలు,ప్రభుత్వ పథకాలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందికరంగా ఉందని, తక్షణమే సంబంధిత అధికారుల వివరాలతో కూడిన బోర్డును వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలన్నారు.

ఇద్దరి అమ్మాయిలను సముద్రంలోకి లాగేసిన అలలు.. తర్వాత ఏమైందో చూడండి..