ఆ పక్షులు మధురంగా పాడే పాటను మరచిపో యాయ్యా ..?!

మనుషులకు పాటలు పాడే గలిగే సామర్థ్యం ఉన్నా లేకపోయినా జీవితం సాఫీగా గడిచిపోతుంది కానీ పక్షుల మనుగడ ఎల్లకాలం ఎప్పటిలాగే కొనసాగాలంటే మగ పక్షులు తాము పాడే పాటలను అసలు మర్చిపోకూడదు.

ఆడ పక్షుల ఆకర్షించడానికి మగ పక్షులు ఒక ప్రత్యేకమైన శబ్దం తో పాట పాడుతూ ఉంటాయి.

ఒకవేళ ఆ ప్రత్యేకమైన పాటను మర్చిపోతే ఆడ పక్షులు మగ పక్షుల వద్దకు అసలు రావు.

దీనివల్ల కొత్తగా పుట్టే పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.ఇదే సమస్య సంవత్సరాల కొద్దీ ఏర్పడితే ఇక ఆ పక్షుల జాతి అంతరించి పోవడం అనివార్యమవుతుంది.

రీజెంట్‌ హనీఈటర్‌ అనే జాతి పక్షులు కూడా ఇదే సమస్య వల్ల అంతరించిపోయే పరిస్థితికి చేరుకున్నారు.

ఈ జాతి పక్షులు ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపించేవట.కానీ 1950 కాలం నుంచి వాటి సంతతి అభివృద్ధి చెందక అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి.

ఈ జాతి పక్షులు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు వందలు మాత్రమే ఉన్నాయట.

అంటే ఈ జాతి పక్షులు పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరిలో ఉన్నాయని తెలుస్తోంది.

"""/"/ మొదట్లో ఈ పక్షులు ఎందుకు అంతరించిపోతున్నాయో తెలియని శాస్త్రవేత్తలు ఆ తర్వాత అసలైన కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

పర్యావరణ శాస్త్రవేత్త రాస్ క్రేట్స్ ఐదేళ్లపాటు పరిశోధనలు చేసి మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించ లేకపోతున్నాయని అందువల్లే వాటి సంతతి అభివృద్ధి చెందలేదని తేల్చారు.

మగ పక్షులు తమ జాతి యొక్క ప్రత్యేకమైన పాట పాడకుండా ఇతర పక్షులు పాడే పాటలను అనుసరించడం మొదలు పెట్టాయని ఆ విధంగా తమ పాటను పూర్తిగా మర్చిపోయాయని దీనివల్ల ఆడ పక్షులను ఆకర్షించే శక్తి కోల్పోయాయని శాస్త్రవేత్త రాస్ క్రేట్స్ చెబుతున్నారు.

ఈ విధంగా రీజెంట్‌ హనీఈటర్‌ మగ పక్షులు పాట మర్చిపోవడం దాని జాతికే పెద్ద శాపంలా మారింది.

వీడియో: చిన్నారి బర్త్‌డే పార్టీలో షో చేశారు.. ఫైర్‌వర్క్స్ మీద పడటంతో..?