టేక్ కట్టెలను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం(,Chendurthi ) లింగంపేట గ్రామ శివారులో టేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.

ఈ క్రమంలో దుండగులు మా పైన దాడికి పాల్పడ్డారని చందుర్తి బీట్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.

లింగంపేట్ గ్రామ స్థానికుల నమ్మదగిన సమాచారంతో అలాగే వారి సహాయంతో టేకు కలపను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

దాడికి యత్నించడంతో బీట్ ఆఫీసర్ పోలీస్ వారి టోల్ ఫ్రీ నెంబర్ అయినా 100 కు కాల్ చేయడంతో పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకున్నారని వారి సహాయంతో పట్టుకున్న కలపను లింగంపేట గ్రామపంచాయతీలో భద్రపరిచామని అన్నారు.

ఫారెస్ట్ సిబ్బంది పై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేపిస్తామని ఫారెస్ట్ సిబ్బంది రాజశేఖర్ తెలిపారు.

విశ్వం సినిమాతో గోపిచంద్ సక్సెస్ కొట్టాడా..?