వైరల్: సింగర్ మంగ్లీ పాటకు కాళ్ళు కదుపుతున్న విదేశీయులను చూడండి!

సింగర్ మంగ్లీ ఎవరో తెలియనివారు బహుశా తెలుగు రాష్ట్రాలలో ఎవరూ వుండరు.మంగ్లీ టీవీ వాఖ్యాతగా కెరీర్ కొనసాగించి, ఆ తరువాత జానపద సినీ గేయాల ద్వారా అందరికీ సుపరిచితురాలు అయింది.

ఈ క్రమంలో ఆమె 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకోవడం విశేషం.

దాంతో మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.

ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఈ పదవిద్వారా సేవలు అందించింది. """/" / ఇకపోతే మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో జన్మించింది.

స్థానికంగా వున్న తాండలోనే 5వ తరగతి వరకూ చదువుకుంది.6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది.

రురల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుందని ఓ మీడియా వేదికగా ఆమె చెప్పింది.

ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది.ఇక అక్కడినుండి ఆమె ప్రస్థానం అందరికీ తెలిసిందే.

ఆమె పడిన పాటలు ఏవిధంగా హిట్ అయ్యాయో తెలియంది కాదు. """/" / అసలు విషయంలోకి వెళితే, గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు విదేశీ యువతులు సైతం ఫిదా అయ్యి తమదైన శైలీలో స్టెప్పులేస్తూ అమెరికా రోడ్లపై స్టెప్పులు వేయడం చూడవచ్చు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి తెలియజేస్తూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్‌ అందించగా అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు.

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన 'చిన్నారి కిట్టయ్య'పాటకు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన సినిమా ఇది.

‘కల్కి 2’ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుందా..? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..?