'అమెరికాలో'తొలిసారిగా'వినాయక నిమర్జనం'
TeluguStop.com
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తెలుగు వారు వివిధ దేశాలలో ఉద్యోగ ,వ్యాపార ,చదువుల నిమిత్తం ఉంటున్నారు.
అయితే చాలా మంది తెలుగు వారు విదేశాలలో ఉద్యోగనియామకాల్లోనే ఎక్కువగా ఉన్నారు ఎన్నో తెలుగు సంఘాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యం లోనే అధికంగా తెలుగువారు ఉంటున్నారు అయితే తెలుగు వారు ఎక్కడా ఉన్నా సరే తెలుగు సాంప్రదాయాలు సంస్కృతులు , పండుగలు మరిచిపోరు ప్రతీ పండుగని తెలుగు సంఘాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తాయి.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే వినాయక చవితి వేడుకలని కూడా ఈ సారి ఎంతో ఘనంగా అమెరికా వ్యాప్తంగా ఎంతో మంది తెలుగు వారు జరుపుకున్నారు అయితే మొదటి సారిగా గణేష్ నిమర్జనం వాషింగ్టన్ లో చేపట్టారు.
ఇందుకోసం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం నుంచి నిర్వాహకులు ప్రత్యేక అనుమతిని కూడా తీసుకున్నారు.
వినాయక చవితి సందర్భంగా కిడ్స్ టు కిడ్స్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో 20 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నాలుగు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అంతేకాదు వెయ్యి కిలోలతో లడ్డూ ప్రసాదం తయారు చేశారు.
ఆ తరువాత పొటామాక్ నదిలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనంచేసి ఆ క్రమంలోనే కార్లతో పెద్దఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.తానా అధ్యక్షుడు సతీశ్ వేమన.
ఉయ్యూరు శ్రీనివాస్.రామ్ చౌదరి.
అక్కడ తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రెమ్యునరేషన్ లెక్కలివే.. ఏకంగా అంత తీసుకుంటున్నారా?