కలర్ మారుతున్న టీమిండియా జెర్సీ

ప్రపంచ కప్ లో భాగంగా ఈ నెల 30 వ తేదీన ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు తో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లూ కలర్‌ జెర్సీకి బదులు నారింజ(ఆరెంజ్‌) రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.

ఇది కేవలం డబ్ల్యుసి లో ఇఎన్‌జి తో మ్యాచ్‌ కు మాత్రమే.ఆ తర్వాత తిరిగి బ్లూ కలర్‌ జెర్సీ నే ధరించనుందట.

ఈ టోర్నీలో ఇఎన్‌జి కూడా బ్లూ కలర్‌ జెర్సీ తో ఆడుతోంది.దీంతో ఇరు జట్ల జెర్సీలు వేర్వేరు కలర్స్‌ లో ఉండాలని ఐసిసి సూచించడం తో ఈ మేరకు టీమిండియా జట్టు తన జెర్సీ రంగును మార్చుకుంది.

డబ్ల్యుసి ఆతిథ్య దేశం కాబట్టి ఇంగ్లండ్‌ కు మినహాయింపు ఇవ్వగా టీమిండియా ఆరెంజ్‌ కలర్‌ తో ఆడనుందన్నమాట.

కాగా ఐసీసీ ఈవెంట్లలో టెలికాస్ట్‌ అయ్యే మ్యాచులకు ఆయా జట్లు రెండేసి రంగుల జెర్సీలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

అయితే ఈ షరతు ఆతిథ్య దేశానికి మాత్రం వర్తించదు.ఆ జట్టు ఒకే రంగు జెర్సీతో టోర్నీ మొత్తం ఆడాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా ఆరెంజ్ రంగు జెర్సీ ని ధరించి ఆడనుంది.ఏయే మ్యాచ్‌లో ఏ రంగు జెర్సీ వెస్తున్నారో ముందే వారికి చెప్పాల్సి ఉంటుంది.