నాలుగు తరాలుగా ఆ కుటుంబంలో అందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే..

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో నాలుగు తరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్న ఓలేటి బంగారేశ్వర శర్మ కుటుంబం.

బంగారేశ్వర శర్మ కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి గ్రేడ్1 ఉపాధ్యాయుడిగాను, శాస్త్రి కుమారుడు శ్రీనివాస శర్మ కూడా ఉపాధ్యాయుడే.

విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమనే విశ్వసించి తాత తండ్రి స్ఫూర్తితో శ్రీనివాస శర్మ తన ఏడుగురు కుమారులను, ఇద్దరు కోడళ్లను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ధి ఔరా అనిపించారు.

పెద్ద కుమారుడు తెలుగు ఉపాధ్యాయుడిగా రెండవ కుమారుడు సంస్కృతిక సాహిత్య అధ్యాపకునిగా మూడవ కుమారుడు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా నాలుగో కుమారుడు ఎస్ జిటి గా ఐదో కుమారుడు వ్యాకరణ అధ్యాపకుడిగా ఆరో కుమారుడు తెలుగు ఉపాధ్యాయుడిగా ఏడవకుమారుడు గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

అలాగే మూడవ కుమారుడు భార్య రాజేశ్వరి ఆరో కుమారుడు భార్య వీరేశ్వరి కూడా టీచర్లే మొత్తం తొమ్మిది మంది ఆ కుటుంబంలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/09/For-four-generations-everyone-in-that-family-is-in-the-teaching-profession-in-mammiaram-details!--jpg "/ శ్రీనివాస శర్మ కూతురు సుబ్బలక్ష్మి కుమారుడు అల్లుడు కూడా ఉపాధ్యాయుల కావడం విశేషం.

నాలుగు తరాలుగా ఓలేటి వారి కుటుంబం ఉపాధ్యాయులుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.తన ఏడుగురు కుమారులు తండ్రి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని శ్రీనివాస శర్మ భార్య వెంకట సీతామహాలక్ష్మి తెలిపారు.

డబ్బులు ఎవరికి ఊరికే రావు… అనిల్ రావిపూడి కామెంట్స్ ఆయన గురించేనా?