టిక్‌టాక్ ఉన్న ఐఫోన్ కోసం రూ.43 కోట్లా.. అమెరికన్‌ జనాల్లో టిక్‌టాక్ పిచ్చి పీక్స్‌కి!

అమెరికాలో టిక్‌టాక్‌ను ( TikTok In America )బ్యాన్ చేశారనే వార్త ఒక్కసారిగా వైరల్ అయిన విషయం విధితమే.

అయితే, ఆ బ్యాన్ పెట్టిన కొన్ని రోజులకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దానిని ఎత్తేశారు.

దీంతో టిక్‌టాక్ ఇక ఉండదులే అని డిలీట్ చేసిన యూజర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

ఎలాగైనా మళ్లీ టిక్‌టాక్ వాడాలని చాలా ఆరాటపడుతున్నారు.టిక్‌టాక్ పిచ్చి ఎంతలా పెరిగిపోయిందంటే.

కొందరు ఏకంగా టిక్‌టాక్ యాప్ ఉన్న పాత ఫోన్ల కోసం లక్షలు, కోట్లు కుమ్మరించేందుకు కూడా రెడీ అవుతున్నారు.

ఇదేం అబద్ధం కాదు, టిక్‌టాక్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది యూజర్లు.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, ఈబేలో ఒక ఐఫోన్ 15 ప్రో( IPhone 15 Pro ) (128 జీబీ) ఫోన్‌ను ఏకంగా 5 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో దాదాపు రూ.

43 కోట్లు) అమ్మకానికి పెట్టారు.ఆ ఫోన్ స్క్రీన్ గార్డ్‌కు పగుళ్లు ఉన్నాయట.

కానీ ఫోన్‌లో టిక్‌టాక్ మాత్రం పక్కాగా ఉందని ఆ అమ్మకందారుడు చెప్పాడు.అంతే, టిక్‌టాక్ ఉంటే చాలు అనుకునే వాళ్లు దాన్ని సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు.

"""/" / సోషల్ మీడియాలోనూ ఇదే హడావుడి."నేను టిక్‌టాక్ డిలీట్ చేశా, కానీ ఇప్పుడు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నా.

టిక్‌టాక్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మాక్స్( IPhone 16 Pro Max ) కోసం 5 వేల డాలర్లు ఇస్తా.

ఎవరైనా ఉంటే డీఎం చేయండి" అని ఒక యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.

అంటే అమెరికన్ జనాలు టిక్‌టాక్‌కు ఎంత పిచ్చిగా ఎడిట్ అయ్యారు అర్థం చేసుకోవచ్చు.

"""/" / అసలు గందరగోళం అంతా జనవరి 19న టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారనే వార్తతో మొదలైంది.

చాలామంది యూజర్లు టిక్‌టాక్ ఉండదేమో అని హడావుడిగా యాప్‌ను డిలీట్ చేసేశారు.కానీ, ట్విస్ట్ ఏంటంటే, 12 గంటలు తిరగకుండానే బ్యాన్‌ను ఎత్తేశారు.

ఇప్పుడు మళ్లీ డౌన్‌లోడ్ చేసుకుందామంటే మాత్రం కుదరట్లేదు.గూగుల్ ప్లే స్టోర్‌లో "ప్రస్తుత అమెరికా చట్టపరమైన నిబంధనల కారణంగా ఈ యాప్ డౌన్‌లోడ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశాం" అని మెసేజ్ చూపిస్తోంది.

ఐఫోన్ యూజర్లకు కూడా దాదాపు ఇలాంటి మెసేజే కనిపిస్తోంది.టిక్‌టాక్ తమ ప్రాంతంలో అందుబాటులో లేదని యాపిల్ చెబుతోంది.

లవర్ కోసం లొల్లి.. స్కూల్‌లోనే జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!