ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే రోజంతా ఆరోగ్యంగా ఉండడానికి, త్వరగా పని చేయడానికి ఉదయం తీసుకునే అల్పాహారమే( Breakfast ) కీలక పాత్ర పోషిస్తుంది.

అంతే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఏదో ఒక అల్పాహారం తప్పకుండా తీసుకుంటూ ఉంటారు.

అయితే చాలా మంది అనారోగ్యకరమైన అల్పాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే అనారోగ్యకరమైన అల్పాహారాలు తీసుకోవడం కారణంగా ప్రస్తుతనికి శరీరం పై అంతగా ప్రభావం చూపినప్పటికీ భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ప్రతి రోజు ఉదయం తీసుకునే ఆహారాలలో పోషకాలు కలిగి ఉండడం ఎంతో ముఖ్యం.

ఇటీవలే ప్రపంచ స్థాయిలో కొన్ని యూనివర్సిటీలు అధ్యయనాలు చేసిన దాని ప్రకారం ఉదయం పూట కొన్ని ఆహారాలు( Food ) తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.

"""/"/ అయితే రోజంతా శరీరం యాక్టివ్ గా ఉండడానికి ఉదయం పూట ఖాళీ కడుపున ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం సమయంలో తినే ఆహారాలు తప్పకుండా రోజంతా శరీరానికి తక్షణ శక్తి నిచ్చే పోషకాలు ఉండే ఈ విధంగా చూసుకోవాలి.

అంతేకాకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే ప్రతి రోజు అల్పాహారాలు తీసుకోవడానికి ముందుగా ఖాళీ కడుపుతో ( Empty Stomach )గోరువెచ్చని నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

అలాగే ఉదయం ప్రతి రోజు నానబెట్టిన బాదం( Soaked Almonds ) తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.

ఇందులో ఉండే కొన్ని మూలకాలు చెడు కొవ్వును నియంత్రిస్తాయి. """/"/ అలాగే ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా ఓట్స్( Oats ) తో తయారు చేసిన ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి.

అలాగే ప్రతి రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

దీంతో పాటు బొప్పాయి పండ్లను( Papaya ) కూడా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఉండే గుణాలు ఆస్తమా, ఎముకల సమస్యలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే కలబంద రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఈ రసం శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఇదేందయ్యా ఇది.. చేతిలో గొడుగు పట్టుకొని రైలు నడుపుతున్న లోకో పైలట్..