ఫుడ్ స్టాల్ నడుపుతూ పాపులర్ అయిన సాయికుమారి నెల సంపాదన అన్ని లక్షలా.. గ్రేట్ అంటూ?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోల ద్వారా, ఫుడ్ ఛానల్స్ ద్వారా పాపులర్ అయిన వాళ్లలో సాయికుమారి ఒకరు.
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసిన సాయికుమారి చేసే వంటకాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
టేస్టీగా ఉండే వెజ్, నాన్ వెజ్ వంటకాలను సాయికుమారి మిగతా హోటళ్లు, రెస్టారెంట్లతో పోల్చి చూస్తే తక్కువ ధరలకే అందిస్తుండటంతో పాటు ప్రేమగా భోజనం వడ్డిస్తున్నారు.
మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానున్న ఊరు పేరు భైరవకోన మూవీ టీమ్ సాయికుమారి ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి వంటలను రుచి చూడటంతో పాటు ఆ వంటలను మెచ్చుకున్నారు.
"""/" /
హీరో సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్లు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫుడ్ కోర్ట్ లో వంటకాలను రుచి చూశారు.
అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సాయికుమారి నెల సంపాదన ఏకంగా రెండున్నర లక్షల రూపాయలకు అటూఇటూ ఉంటుందని తెలుస్తోంది.
ఫుడ్ స్టాల్ ద్వారా ఇంత భారీ రేంజ్ లో సంపాదించడం అంటే సులువు కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"""/" /ఊరు పేరు భైరవకోన టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో సాయికుమారి ఫుడ్ స్టాల్ పేరు మరోసారి మారుమ్రోగుతోంది.
ఊరు పేరు భైరవకోన సినిమా విషయానికి వస్తే ఏకంగా 27 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈగల్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.ఊరు పేరు భైరవకోన బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
వావ్, ఆర్మీ వెహికల్‌ని హోటల్‌గా మార్చేశారు.. ఒక్క నైట్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే…