హైదరాబాద్‎లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. !!

హైదరాబాద్ లోని మాదాపూర్ రామేశ్వరం కేఫ్ ( Rameswaram Cafe )లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.ఈ క్రమంలోనే పది కేజీల పెరుగుతో పాటు ఎనిమిది లీటర్ల పాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

అలాగే కిచెన్ లో పని చేస్తున్న సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్స్ లేనట్లు నిర్ధారించారు.

ఇక కేఫ్ లో డస్ట్ బిన్ల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ లో సింథటిక్ ఫుడ్ కలర్ ను గుర్తించారు.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒరిజినల్ కాపీని హోటల్ ప్రాంగణంలో యాజమాన్యం ఉంచలేదని సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్25, మంగళవారం 2024