తిరుపతి జిల్లా ఆరే గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం
TeluguStop.com
తిరుపతి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.కేవీపీపురం మండలం ఆరే గ్రామంలో ప్రసాదం కలుషితం అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కలుషిత ప్రసాదం తిని పలువురు గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.
సుమారు వంద మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు.వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపును కొనసాగిస్తున్నారు.బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అలా పిలిస్తే మాత్రమే బాలకృష్ణకు ఇష్టం.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!