తిరుపతి జిల్లా ఆరే గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం

తిరుపతి జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.కేవీపీపురం మండలం ఆరే గ్రామంలో ప్రసాదం కలుషితం అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కలుషిత ప్రసాదం తిని పలువురు గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.

సుమారు వంద మంది వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు.వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో మెడికల్ క్యాంపును కొనసాగిస్తున్నారు.బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అమ్మాయిలు రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్‌.. చివరికి?