1190 వ రోజులుగా ‌పేదలకు అన్నదాన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పట్టణంలోని ప్రముఖ ఆలయాల ముందు యాచకులకు, అన్నార్తులకు, అభాగ్యులకు, పేదలకు దాతల సహాయంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది.

దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 1190 వ రోజుగా సోమవారం వేములవాడ పట్టణంలోని లక్ష్మీ గణపతి కాంప్లెక్స్, భీమేశ్వర ఆలయం, రాజన్న ఆలయం వద్ద పేదలకు, అన్నార్తులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అన్నదాత కుమారుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూక రాజు- రాజ్యలక్ష్మి దంపతులు, శాశ్వత దాతలు జువ్వాడి స్నేహాలత- వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న -సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్- జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ- సాంబశివు దంపతులు, దేవరాజు- ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కుమారులు కోడళ్లు రామడుగు ప్రజ్ఞ- శరత్ చంద్ర దంపతులు, రామడుగు శిరీష- సాయిచంద్ర దంపతులు, రామడుగు శర్వాణి -రవిచంద్ర దంపతుల సహాయ సహకారాలతో అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.

అన్నదానానికి శాశ్వత సభ్యత్వం పొందే వారు ట్రస్ట్ సభ్యులను సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ మధు మహేష్ కోరారు.

ఈ అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొంగళ్ళ రవికుమార్, నాగుల చంద్రశేఖర్, బొడ్డు కృష్ణ, పాత నంతోష్, పొలాస రాజేందర్, నంది సాయికుమార్, సగ్గు రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు సుబ్బరాజు… ఫోటోలు వైరల్!