అన్నార్తులకు పేదలకు 1083 రోజులుగా అన్నదాన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా : దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1083 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న ఆలయం వద్ద, భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేదలకు, అన్నార్తులకు మరియూ యాచకులకు ప్రతీరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ట్రస్టు గూగుల్ పే,ఫోన్ పే నం.

89855 88060 కు అందిస్తే వారి కుటుంబ సభ్యుల పేర అన్నదానం చేయడం జరుగుతుందని అన్నం పరబ్రహ్మ స్వరూపం నేటి అన్నదాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు ఉన్నారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పసూల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉక్రేనియన్ బ్లాగర్‌కి వడ పావ్‌ ఇచ్చిన వీధి వ్యాపారి.. ఆమె రియాక్షన్ చూస్తే..?