వారంలో మూడు సార్లు ఇలా చేస్తే మీ దంతాలు తెల్లగా దృఢంగా మారడం ఖాయం!

తమ దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.

తెల్లటి మెరిసే దంతాలు( Teeth ) మనల్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.అందుకే అటువంటి దంతాల కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

కానీ ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, దంత సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.

అటువంటి దంతాలు కలిగిన వారు మనస్ఫూర్తిగా ఇతరులతో మాట్లాడలేరు.అలాగే నలుగురిలో హాయిగా నవ్వనూ లేరు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై అస్సలు చింతించకండి.

ఎందుకంటే వారంలో కేవలం మూడు సార్లు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే మీ దంతాలు తెల్లగా మెరవడమే కాదు దృఢంగా సైతం మారతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం అల్లం ముక్క( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్ ను సెపరేట్ చేసుకోవాలి. """/" / ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్ వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ ఉప్పు,( Salt ) పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు టూత్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని దంతాలకు బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని సున్నితంగా తోముకోవాలి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు దంతాలను తోముకుని ఆపై వాటర్ తో శుభ్రంగా నోటిని క్లీన్ చేసుకోవాలి.

"""/" / వారంలో కేవలం మూడు సార్లు ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు కొద్దిరోజుల్లోనే తెల్లగా కాంతివంతంగా మెరుస్తాయి.

అలాగే బలహీనంగా ఉన్న దంతాలు దృఢంగా మారతాయి.చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

కాబట్టి దంతాలను తెల్లగా, దృఢంగా మార్చుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన సింపుల్ రెమెడీని పాటించండి.