ట్రాఫిక్ రూల్స్ పాటించండి…!

నల్లగొండ జిల్లా: రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రహదారులపై ట్రాఫిక్‌ నిబంధనలు పాటించే విషయంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు సోమవారం ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్‌ సిఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లడుతూ పాదచారులు ఫుట్‌పాత్‌ల పైనే నడవాలని,ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

ట్రాఫిక్‌ పోలీసులు సూచించే విషయాలని పాటించాలని విజ్ఞప్తి చేశారు.ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్‌ చెయ్యొద్దని, తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని, అలాగే మద్యం సేవించి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడపడం వల్ల వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని సూచించారు.

ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జాగృతి పోలీస్ కళాబృందం ఆటపాటలతో వాహనదారులు మరియు పాదాచారులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి, ఏఎస్ఐలు ఫరీద్, సత్యనారాయణ,ట్రాఫిక్‌ సిబ్బంది,జాగృతి పోలీస్ కళాబృందం ఇంచార్జ్ హుస్సేన్,శేఖర్,సత్యం తదితరులు పాల్గొన్నారు.

డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?