మూడు రోజులకు ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే మొటిమలు తొంగి కూడా చూడవు!
TeluguStop.com
మొటిమలు.సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.
టీనేజ్ ప్రారంభం అయ్యిందంటే చాలు పనిగట్టుకుని మరీ వచ్చి మొటిమలు ముప్ప తిప్పలు పెడుతుంటాయి.
కొందరు అమ్మాయిలు మొటిమల కారణంగా తీవ్ర మానసిక శోభకు గురవుతుంటారు.మొటిమలను ఎలా వదిలించుకోవాలో అర్థం గాక లోలోన మదన పడిపోతూ ఉంటారు.
మీరు కూడా ఈ జాబితాలో ఉంటే ఇకపై టెన్షన్ వదిలేయండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ చిట్కాను మూడు రోజులకు ఒకసారి పాటిస్తే మొటిమలు తొంగి కూడా చూడవు.
మొటిమలకు దూరంగా ఉండాలని భావించే వారికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ ను వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
చివరిగా సరిపడా బియ్యం కడిగిన వాటర్ ను వేసి మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి కాస్త మందంగా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
చర్మం పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
మూడు రోజులకు ఒకసారి ఈ చిట్కాని పాటిస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
"""/"/
అలాగే తరచూ మొటిమలు వేధించకుండా సైతం ఉంటాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మురికి, మృతకణాలు తొలగిపోతాయి.
ఆయిలీ స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం నిత్యం ప్రకాశవంతంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి కలిగించడానికి కూడా ఈ చిట్కా ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
హలో అబ్బాయిలు.. జుట్టు పల్చబడిందా.. వర్రీ వద్దు ఇలా చేయండి!