ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!
TeluguStop.com
సీజన్ ఏదైనా కూడా దోమల( Mosquitoes ) బెడద మాత్రం తగ్గడం లేదు.
ఇంటిని, ఇంటి పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ సాయంత్రం అయిందంటే చాలు దోమలు ఇంట్లోకి చొరబడి కుట్టి కుట్టి చంపేస్తుంటాయి.
ఫలితంగా దురద, వాపు, పుండ్లు వంటి సమస్యలే కాకుండా డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, వెస్ట్ నైల్ వైరస్ తదితర విష జ్వరాలు వచ్చే రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.
అందుకే దోమలను తరిమి కొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చాలా సింపుల్ గా మరియు న్యాచురల్ గా దోమలను తరిమేయవచ్చు.
అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు కప్పులు ఎండిన వేపాకు( Dry Neem Leaves ) వేసుకోవాలి.
అలాగే ఐదు నుంచి ఆరు బిర్యానీ ఆకులను( Biryani Leaves ) ముక్కలు చేసి వేయాలి.
వీటితో పాటు నాలుగు లవంగాలు,( Cloves ) ఒక కప్పు ఉల్లి తొక్కలు, అర కప్పు వెల్లుల్లి తొక్కలు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
"""/" /
ప్రతిరోజు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకున్న మిక్చర్ వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాల నూనె మరియు ఒక కర్పూరం పెట్టి వెలిగించాలి.
ఇలా వెలిగించడం ద్వారా వచ్చే పొగ ఇల్లు మొత్తం వ్యాప్తి చెందేలా చేశారంటే దోమలు ఏ మూలన దాగి ఉన్నా కూడా దెబ్బకు పరార్ అవుతాయి.
దోమలను తరిమి కొట్టడంలో ఈ రెమెడీ వండర్ ఫుల్ గా పని చేస్తుంది.
రెగ్యులర్ గా ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.
పైగా ఈ రెమెడీతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.
బాలయ్య అఖండ 2 సినిమాలో విలయ తాండవం చేయబోతున్నాడా..?