వారానికి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ జుట్టు ఒత్తుగానే కాదు సిల్కీగా కూడా మారుతుంది!

జుట్టు ఒత్తుగా సిల్కీ గా( Silky Hair ) మెరిసిపోతూ కనిపిస్తే చూడడానికి ఎంత అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అందుకే మగువలు అటువంటి హెయిర్ కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఖరీదైన హెయిర్ ఆయిల్, షాంపూ, సీరం.

ఇలా ఎన్నెన్నో ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే వీటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్న‌ది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా( Simple Remedy ) మాత్రం మీకు చాలా బాగా సహాయపడుతుంది.

వారానికి ఒక్కసారి ఈ చిట్కాను పాటిస్తే సహజంగానే మీ కురులు ఒత్తుగా సిల్కీగా మారతాయి.

"""/" / మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో ఏడు నుంచి ఎనిమిది మందారం పువ్వులు, రెండు రెబ్బలు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లీ స్ట్రక్చర్( Water Jelly Structure ) లోకి మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ చిట్కాను పాటిస్తే హెయిర్ గ్రోత్( Hair Growth ) ఇంప్రూవ్ అవుతుంది.

కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అదే సమయంలో కురులు సిల్కీగా షైనీ గా మారతాయి.

అలాగే ఈ చిట్కాను పాటిస్తే తెల్ల జుట్టు( White Hair ) త్వరగా రాకుండా సైతం ఉంటుంది.

విక్రమ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టార్ డైరెక్టర్…