Teeth : వారానికి 2 సార్లు ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే మీ దంతాలు తెల్లగా ఆరోగ్యంగా మారడం ఖాయం!
TeluguStop.com
తెల్లటి ఆరోగ్యకరమైన దంతాలు కలిగి ఉన్నవారు త్వరగా ఆకర్షితులవుతారు.మరియు ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారు.
అందుకే ప్రతి ఒక్కరూ తమ దంతాలు( Teeth ) తెల్లగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు.
రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తుంటారు.కేవలం టూత్ పేస్ట్ మాత్రమే దంతాలను తెల్లగా, ఆరోగ్యంగా ఉంచుతుంది అనుకుంటే పొరపాటే అవుతుంది.
అందుకు పోషకాహారం తీసుకోవడం తో పాటు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉండాలి.
తద్వారా దంతాలను తళతళ మెరిపించుకోవచ్చు.దృఢంగా మార్చుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించారంటే మీ దంతాలు వైట్ గా మరియు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు( Biryani Leaves ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకులు పొడి వేసుకోవాలి.
"""/" /
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్( Salt ) , వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( Lemon Juice ), వన్ టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్( Tooth Paste ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు పట్టించి కనీసం రెండు నిమిషాల పాటు బాగా తోముకోవాలి.
ఆ తర్వాత వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
"""/" /
ఈ సింపుల్ చిట్కాను వారానికి రెండు సార్లు కనుక పాటిస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లగా మారతాయి.
ముత్యాలు మాదిరి అందంగా మెరిసిపోతాయి.అలాగే బిర్యానీ ఆకు, తేనె, నిమ్మరసం లో ఉండే పోషకాలు దంత ఆరోగ్యాన్ని పెంచుతాయి.
దంతాలను దృఢంగా మారుస్తాయి.బ్యాడ్ బ్రీత్, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలకు సైతం చెక్ పెడతాయి.
కాబట్టి ఆరోగ్యమైన తెల్లటి దంతాలను కోరుకునే వారు తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.
కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణాలేంటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..?