ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే ఇంట్లోనే సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను పొందొచ్చు!

సిల్కీ అండ్ షైనీ హెయిర్ కోసం చాలా మంది అమ్మాయిలు ఆరాటపడుతుంటారు.అయితే ప్రస్తుత చలికాలంలో ఎంత కేర్ తీసుకున్నప్పటికీ జుట్టు పొడి బారిపోయి నిర్జీవంగా మారుతుంటుంది.

దాంతో డ్రై హెయిర్ ను నివారించుకోవడం కోసం నానా తిప్పలు పడుతుంటారు.కొందరైతే వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్‌ కూడా చేయించుకుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే ఇంట్లోనే సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను సులభంగా పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటి.? అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ ను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.

ఆ తర్వాత ఒక ఫుల్ ఎగ్ ను బ్రేక్ చేసి వేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి స్పూన్ తో అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని.

కనీసం గంటన్నర పాటు వదిలేయాలి. """/"/ ఆపై మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్‌ చేయాలి.

వారంలో రెండు సార్లు కనుక ఈ రెమెడీని పాటిస్తే డ్రై హెయిర్ అన్న మాట అనరు.

జుట్టు స‌హ‌జంగానే స్మూత్ అండ్ సిల్కీ గా మారుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.

దాంతో హెయిర్ ఫాల్‌, హెయిర్‌ డ్యామేజ్ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.

కాబట్టి తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!