సహజంగానే చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!
TeluguStop.com
ముఖ చర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకునేవారు మనలో చాలా మంది ఉంటారు.
అటువంటి చర్మాన్ని పొందడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీములు, సీరంలు కొనుగోలు చేసి వాడుతుంటారు.
ఇంకొందరు సహజంగానే చర్మాన్ని తెల్లగా( Skin Whitening ) మార్చుకోవాలని భావిస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే మీ స్కిన్ సూపర్ వైట్ గా, బ్రైట్ గా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు లేటు చర్మాన్ని తెల్లగా మార్చే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు( Red Masoor Dal ) వేసుకోవాలి.
అలాగే అర కప్పు పచ్చి పాలు( Raw Milk ) వేసుకొని బాగా కలిపి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఈలోపు చిన్న బంగాళదుంప( Potato ) తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు మరియు మరికొన్ని పాలు వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారు.
ఈ రెమెడీ స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.మరియు చర్మం తేమగా మృదువుగా సైతం మారుతుంది.
ప్రభాస్, బన్నీలలో నంబర్ వన్ ఎవరు.. ఈ ప్రశ్నకు జవాబు దొరికేది అప్పుడేనా?