ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది!
TeluguStop.com
ఎలాంటి మచ్చ, మొటిమ లేకుండా స్కిన్ క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.
అయితే ఇటువంటి చర్మం పొందడం అసాధ్యంగా భావిస్తుంటారు.కానీ సాధ్యమే అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ అద్భుతంగా తోడ్పడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండానే మీరు కోరుకున్న చర్మం మీ సొంతమవుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( Rose Petals ) వేసి ఉడికించాలి.
"""/" /
ఆల్మోస్ట్ వాటర్ సగం అయ్యేంతవరకు హిట్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఆ తర్వాత వాటర్ ను స్టైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శనగ పిండి( Besan Flour ), పావు టేబుల్ స్పూన్ పసుపు ( Turmaric )వేసుకోవాలి.
అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న రోజ్ వాటర్( Rose Water ) ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆపై మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మీ ముఖ చర్మం పై ఎలాంటి మచ్చ ఉండదు.
మొటిమలు రావడం కంట్రోల్ అవుతాయి.వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మం క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మారుతుంది.
పైగా ఈ రెమెడీ వల్ల మీ స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.
పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?