Skin Care Tips : రోజూ నైట్ ఈ చిన్న ఇంటి చిట్కాను పాటిస్తే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు పక్కా!!
TeluguStop.com
ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందికి ముఖంపై నల్లటి మచ్చలు( Black Spots ) ఏర్పడుతుంటాయి.
మొటిమలు, వయసు పైబడటం, పిగ్మెంటేషన్ తదితర అంశాలు ఈ మచ్చలకు కారణం అవుతుంటాయి.
ఏదేమైనా నల్లటి మచ్చలు మొత్తం అందాన్ని దెబ్బతీస్తాయి.ముఖాన్ని అందవిహీనంగా చూపిస్తాయి.
అందుకే ముఖం పై ఏర్పడిన మచ్చలు వదిలించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు.రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
కొందరు కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ వాడుతుంటారు.అటువంటి ఉత్పత్తుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.
చర్మ ఆరోగ్యం పాడవుతుంది. """/" /
అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలు సమర్థవంతంగా నివారించగలవు.
పైగా ఇంటి చిట్కాలు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఈ నేపథ్యంలోనే మచ్చలు మాయం చేసే ఒక సింపుల్ ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు బాగా చేసుకోవాలి.
ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. """/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఏమైనా ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూది సాయంత్రం ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని నిద్రించాలి.
మరసటి రోజు ఉదయానే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ చిన్న ఇంటి చిట్కాను రోజు నైట్ పాటించారంటే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.
లెమన్ జ్యూస్, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్( Rose Water) ఉండే పలు సుగుణాలు మొండి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
కొద్దిరోజుల్లోనే మచ్చలను పూర్తిగా మాయం చేస్తాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అయ్యేలా ప్రోత్సహిస్తాయి.
అలాగే ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.
చర్మం పై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.మొటిమలు రావడం కంట్రోల్ అవుతాయి.
మరియు పిగ్మెంటేషన్ సమస్య సైతం దూరం అవుతుంది.కాబట్టి మచ్చలేని ముఖ చర్మాన్ని కోరుకునేవారు ఈ సింపుల్ రెమెడీని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి.
కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!