పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!

హెయిర్ ఫాల్.( Hair Fall ) ఆడవారే కాదు మగవారు సైతం ఈ సమస్యతో ఎంతగానో సతమతం అవుతున్నారు.

ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల కొందరు పురుషుల్లో హెయిర్ ఫాల్ అనేది అధికంగా ఉంటుంది.

హెయిర్ ఫాల్ వల్ల జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుంటే ఏం చేయాలో తెలియక తెగ వర్రీ అయిపోతుంటారు.

కానీ పురుషులు తలస్నానం( Head Bath ) చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిన్న ట్రిక్ పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు.

"""/" / అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు ( Curry Leaves ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్ లో ఒక గ్లాస్ వాటర్ మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.

"""/" / ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

తరచూ ఈ విధంగా కనుక చేశారంటే జుట్టు రాలడం అనేది క్రమంగా కంట్రోల్ అవుతుంది.

కలబంద మరియు కరివేపాకు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

ఊడిన జుట్టును మళ్లీ మొలిపిస్తాయి.కాబట్టి అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న పురుషులు తప్పకుండా ఈ షాంపూ హ్యాక్‌ను ప్రయత్నించండి.

అలాగే కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోండి.డైట్ లో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నట్స్, తృణధాన్యాలను చేర్చుకోండి.

ఒత్తిడికి వీలైనంతవరకు దూరంగా ఉండండి.మరియు స్మోకింగ్ అలవాటును విడిచి పెట్టండి.

ఆ తప్పు వల్లే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!