వారంలో 2 సార్లు ఈ రెమెడీని పాటిస్తే స్మూత్ బ్రైట్ & గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!
TeluguStop.com
సాధారణంగా చాలా మంది తమ ముఖ చర్మం స్మూత్‌గా, బ్రైట్‌గా మరియు గ్లోయింగ్ గా మెరిసిపోవాలని చెప్పి మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అలాగే తరచూ బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటారు.ఈ క్రమంలోనే చర్మం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా స్మూత్ బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో.ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ షుగర్, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ గంధం పొడి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని అన్ని కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం స్మూత్ గా, బ్రైట్ గా మారుతుంది చర్మంపై మృత కణాలు, మురికి ఏమైనా ఉంటే తొలగిపోయి గ్లోయింగ్ గా మెరుస్తుంది.