దీపావళి వచ్చేస్తుంది.. ఈ రెమెడీని పాటిస్తే మృదువైన మెరిసే చర్మం మీసొంతం!
TeluguStop.com
దీపావళి పండుగ రాబోతోంది.హిందూ సాంప్రదాయంలో దీపావళికి ఎంతో విశిష్టత ఉంది.
అలాగే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా మరియు ఆనందంగా జరుపుకునే పండుగ ఇది.
అయితే పండగ అంటే మగువలు ఆ రోజున అందంగా మెరిసిపోవాలని తెగ ఆరాటపడుతుంటారు.
ఈ క్రమంలోనే వారం రోజుల ముందు నుంచే చర్మం పై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే కనుక ఈ దీపావళికి దీపాల మధ్య మీ ముఖ చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేయాలి.
అనంతరం ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఆరెంజ్ పండును తీసుకుని దానిని ఉండే తొక్కను వేరు చేయాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు నుంచి మూడు ఫ్రెష్ ఆరెంజ్ తొక్కలు, అరకప్పు బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని.
ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఆపై నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చర్మం మృదువుగా మరియు నిగారింపుగా మారుతుంది.
చర్మ ఛాయ మెరుగు పడుతుంది.మరియు మొటిమలు, మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.