వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు రెండింతలు అవుతుంది!

సాధారణంగా చాలా మంది త‌మ జుట్టు సన్నగా ఉందని తెగ బాధపడుతూ ఉంటారు.

వీరిలో హెయిర్ ఫాల్ ఉంటుంది.కానీ హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది ఉండదు.

దీంతో ఊడే జుట్టు ఊడుతుంది.అయితే కొత్త జుట్టు రాదు.

ఫలితంగా జుట్టు పల్చగా మారిపోతుంది.ఇటువంటి జుట్టుతో మీరు కూడా సతమతం అవుతున్నారా.

? అయితే ఇకపై చింతే వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారానికి ఒక్కసారి పాటిస్తే చాలు మీ జుట్టు రెండింతలు అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి. """/"/ ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బలు వేపాకు వేసుకోవాలి.

అలాగే నాలుగు నుంచి ఐదు మందారం ఆకులు( Hibiscus Leaves ) తుంచి వేసుకోవాలి.

చివరగా మూడు రెబ్బలు కరివేపాకు మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

"""/"/ కొద్ది రోజుల్లోనే పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

దాంతో హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో కురులు సిల్కీగా షైనీ గా( Silky And Shiny Hair ) మెరుస్తాయి.

చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.స్కాల్ప్ ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

వీడియో: ప్రెగ్నెంట్ వైఫ్‌ను మోసం చేసిన భర్త.. అడ్డంగా పట్టుకొని ఏకిపారేసింది..