ఈ రెమెడీని వారానికి కేవలం ఒక్కసారి పాటిస్తే మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా పెరుగుతుంది!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ధూమపానం, మద్యపానం, కాలుష్యం, పలు రకాల మందుల వాడకం త‌దిత‌ర‌ల కార‌ణాల వల్ల కొంద‌రికి హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది ఆగిపోతుంటుంది.

ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఎంతగానో సతమతం అవుతుంటారు.కానీ చింతే అక్కర్లేదు.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారానికి కేవలం ఒక్కసారి కనుక పాటిస్తే మీ జుట్టు వద్దన్నా ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఎగ్స్ ను బ్రేక్‌ చేసి వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, ఐదు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

మళ్లీ అదే మిక్సీ జార్ లో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మెంతుల పేస్ట్ లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత‌ ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్( Hair Wash ) చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ ట్రిపుల్ అవుతుంది.వద్దన్నా సరే మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.

కాబట్టి హెయిర్ గ్రోత్ లేదని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కార్చగల టాలెంటెడ్ యాక్టర్లు.. ఎవరంటే..