మొటిమ‌ల‌కు దూరంగా ఉండాల‌నుకుంటే త‌ప్ప‌కుండా ఇది ఫాలో అవ్వండి!

మొటిమలు అందాన్ని పాడు చేయడంలో ముందుంటాయి.ముఖ చర్మం అందంగా, తెల్లగా మెరిసిపోతున్నా.

ఎక్కడో ఒకచోట కనిపించే చిన్న మొటిమ మనలోని మనోధైర్యాన్ని దెబ్బ తీస్తుంది.అందుకే ముఖంపై మొటిమ వచ్చిందంటే చాలు దాన్ని త్వరగా తగ్గించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.

ఏవేవో క్రీములు రాస్తుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలను ప్రయత్నిస్తుంటారు.

అయితే ఎన్ని చేసినా ఒక్కోసారి మొటిమలు అంత త్వరగా పోనే పోవు.దాంతో ఏం చేయాలో తెలియక లోలోన మదన పడుతూ ఉంటారు.

కానీ ఇకపై టెన్షన్ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని ఫాలో అయ్యారంటే మొటిమలకు దూరంగా ఉండొచ్చు.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఒక చూపు చూసేయండి.ముందుగా రెండు టేబుల్ స్పూన్ల మెంతులను మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హిట్ అవ్వగానే అందులో మెంతుల పొడి, అర టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసి దాదాపు పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు మ‌రో బౌల్‌ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల‌ అలోవెరా జెల్, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్‌ వేసుకొని కలుపుకోవాలి.

"""/"/ చివరిగా అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మెంతుల నీటిని కూడా పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

రాత్రి నిద్రించే ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని నిద్రించాలి.

మరుసటి రోజు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ప్రతిరోజు ఈ విధంగా చేస్తే మొటిమలు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

అలాగే మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి.

డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర చేసిన పాకిస్థానీ అరెస్ట్..