మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!
TeluguStop.com
నెక్ డార్క్ నెస్ ( Darkness Of The Neck )అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టి చర్మ సమస్య.
ముఖ్యంగా ఆడవారిలో ప్రెగ్నెన్సీ టైంలో తలెత్తే హార్మోన్ల చేంజ్ వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అలాగే ఎండల ప్రభావం, ఓవర్ వెయిట్, థైరాయిడ్ ( Overweight, Thyroid )వంటి పలు అనారోగ్య సమస్యలు, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం తదితర అంశాలు మెడ నల్లగా మారడానికి కారణం అవుతుంటాయి.
ఏదేమైనా ముఖం ఒక రంగులో.మెడ ఒక రంగులో ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు ఎన్నెన్నో ప్రోడక్ట్స్ వాడుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీతో సులభంగా మెడను తెల్లగా మృదువుగా మెరిపించుకోవచ్చు. """/" /
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ( Coffee Powder )వేసుకోవాలి.
అలాగే పావు టీ స్పూన్ పటిక ( Alum )పొడిచ వన్ స్పూన్ తేనె, హాఫ్ టీ స్పూన్ గ్లిజరిన్ ( Glycerin )మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. """/" /
వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించడం వల్ల మెడపై పేరుకు పోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.
మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.కాఫీ పౌడర్, పటిక, గ్లిజరిన్, తేనె మరియు రోజ్ వాటర్ ఇవన్నీ మెడను తెల్లగా మృదువుగా మారుస్తాయి.
అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.కాబట్టి మెడ నలుపుతో బాధపడుతున్న వారు, రకరకాల ప్రోడక్స్ వాడి విసిగిపోయిన వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
దిల్ రూబా మూవీ రివ్యూ అండ్ రేటింగ్