జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!
TeluguStop.com
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటే ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కానీ పోషకాల కొరత, కాలుష్యం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం, రసాయనాలు అధికంగా ఉంటే షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల చాలా మందికి హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.
మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ ను వేసుకుంటే మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.
"""/" /
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు బియ్యం నానబెట్టిన వాటర్( Rice Water ) పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మెంతులను రైస్ వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమం లో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్,( Amla Powder ) వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కురులు దృఢంగా మారతాయి.
జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ లభిస్తుంది.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.
అలాగే మెంతులు, రైస్ వాటర్, ఆమ్లా పౌడర్ మరియు ఆవనూనెలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.
చుండ్రు సమస్యను దూరం చేసి స్కాల్ప్ ను శుభ్రంగా హైడ్రేట్ గా మారుస్తాయి.
హెయిర్ గ్రోత్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?