చుండ్రు పోయి కురులు స్ట్రాంగ్ గా మారాలా.. అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!

చుండ్రు( Dandruff ) విపరీతంగా వేధిస్తుందా.? ఎంత ప్రయత్నించినా అది మిమ్మల్ని వదిలి పెట్టడం లేదా.

? చుండ్రుతో బాగా విసిగిపోయారా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం రెండు మూడు వాషుల్లోనే చుండ్రు మొత్తం పోతుంది.

అదే సమయంలో మీ కురులు స్ట్రాంగ్ గా మారతాయి.మరి ఇంతకీ చుండ్రును మాయం చేసే ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి.

అలాగే అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు బిర్యానీ ఆకులు( Flax Seeds ) వేసి కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.

అప్పుడు వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జెల్ ను స్ట్రైనర్ సహాయంతో సపరేట్ చేసి పెట్టుకోవాలి.

"""/" / ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతి పొడిని వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు తయారు చేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే చుండ్రు ఎంత అధికంగా ఉన్నా కూడా క్రమంగా దూరమవుతుంది.

కేవలం రెండు మూడు వాషుల్లోనే చుండ్రు మొత్తం పోతుంది.స్కాల్ప్ హెల్తీగా మారుతుంది.

అదే సమయంలో హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఫలితంగా హెయిర్ ఫాల్ సమస్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు దూరం అవుతాయి.కాబట్టి చుండ్రు పోయి కురులు బలోపేతం అవ్వాలి అని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

దేవర హిందీ ప్రమోషన్ల కోసం టాప్ స్టార్లు.. యంగ్ టైగర్ ప్లాన్ వేరే లెవెల్ లో ఉండనుందా?