ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఒక్క దెబ్బతోనే మాయం!
TeluguStop.com
స్త్రీలే కాదు ఎందరో పురుషులు కూడా చుండ్రు సమస్యతో ( Dandruff Problem )బాధపడుతుంటారు.
అత్యంత విసుగు తెప్పించే కేశ సంబంధిత సమస్యల్లో చుండ్రు ముందు వరుసలో ఉంటుంది.
చుండ్రు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి.అలాగే చుండ్రు సమస్యను వదిలించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చుండ్రు ఒక్క దెబ్బతోనే మాయం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( Spoons Fenugreek )వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు కలబంద ఆకును( Aloe Vera Leaf ) తీసుకుని శుభ్రంగా వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, నాన బెట్టుకున్న మెంతులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ), వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు చాలా వరకు ఒక్క దెబ్బతోనే మాయం అవుతుంది.
ఇంకా కనుక మీకు చుండ్రు ఉంటే రెండు మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి.
చుండ్రు సమస్యకు బై బై చెప్పండి.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.
పొడి జుట్టు నివారణకు కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.