కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు వద్దన్నా కూడా మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది!
TeluguStop.com
మనలో చాలా మందికి హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది అస్సలు ఉండదు.
దీని కారణంగా జుట్టు రోజురోజుకు పల్చగా తయారవుతుంటుంది.ఈ క్రమంలోనే హెయిర్ గ్రోత్ ను పెంచుకోవడానికి మరియు పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీ సింపుల్ గా ఉన్నా కూడా సూపర్ పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
ఈ రెమెడీని పాటించారంటే వద్దన్నా మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది.ఈ రెమెడీ కోసం కావాల్సిన పదార్థాలు మెంతి పిండి( Fenugreek Flour ) మరియు అన్నం గంజి.
( Rice Porridge ) సాధారణంగా అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని చాలా మంది బయట పారబోస్తుంటారు.
కానీ అన్నం గంజి మన జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. """/" /
ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అన్నం గంజి వేసుకోవాలి.
అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మెంతి పిండి వేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట తర్వాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే క్రమంగా ఒత్తుగా మారుతుంది.
"""/" /
ఈ రెమెడీ హెయిర్ గ్రోత్ ను చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది.
జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది.
అంతేకాదు మెంతి పండి మరియు అన్నం గంజి డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తాయి.
జుట్టును సిల్కీగా మరియు స్మూత్ గా మెరిపిస్తాయి.స్కాల్ప్‌కి హైడ్రేషన్‌ని అందిస్తాయి.
ఫ్లాకీనెస్ మరియు దురదను సైతం నివారిస్తాయి.
అఖండ సీక్వెల్ లో సన్యాసి పాత్రలో ప్రముఖ సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?