తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలా.. అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెర‌గాల‌ని ఎంత‌గా కోరుకుంటారో.తెల్ల జుట్టు( White Hair ) రాకూడ‌ద‌ని కూడా అంతే కోరుకుంటారు.

కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే వైట్ హెయిర్ ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తున్నారు.

తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.అందువల్ల తలలో తెల్ల వెంట్రుకలు కనిపించగానే తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడతారు.కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ మీకు తాత్కాలికంగా పరిష్కారాన్ని చూపించిన.

ఆ తర్వాత అనేక సమస్యలు తెచ్చిపెడతాయి.అందుకే సహజ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.

"""/" / అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీ మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు( Amla Slices ) వేసి నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.

చివరిగా రెండు రెబ్బలు కరివేపాకు, అర కప్పు గోరింటాకు ఆకులు వేసి వేయించాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రై చేసుకున్న పదార్థాల‌న్నీ వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. """/" / ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు త‌యారు చేసుకున్న పొడిని వేసుకోవాలి.

ఈ పొడిలో కొబ్బ‌రి నూనె లేదా ఆవ నూనె లేదా బాదం నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను ఉప‌యోగించి త‌ల‌స్నానం చేయాలి.వారానికి ఒక్క‌సారి ఈ విధంగా చేశారంటే మీ తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుతుంది.

వైట్ హెయిర్ కు చెక్ పెట్ట‌డానికి ఈ రెమెడీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

పైగా ఈ రెమెడీని పాటించ‌డం వ‌ల్ల కురులు ఆరోగ్యంగా ఒత్తుగా సైతం మార‌తాయి.

రెండోసారి తల్లి కాబోతున్న ప్రముఖ నటి ప్రణీత.. ఈ దుస్తులు ఇక సరిపోవంటూ?